- ‘సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్’ రెండో సీజన్‌కు సిద్దం
ప్రజాశక్తి - హైదరాబాద్ : నగరంలో క్రీడా ఉత్సాహాన్ని నింపేందుకు ‘సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్’ (సిసిపిఎల్) రెండో సీజన్ అక్టోబర్ 17 నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఆటగాళ్ల వేలం, ఫ్రాంచైజీల వీకెండ్ ప్రక్రియ థాయిలాండ్‌లోని పుకెట్‌లో విజయవంతంగా ముగిసింది. కోకోనట్ పికిల్‌బాల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేలంలో మ్యావెరిక్స్, ఆల్ స్టార్స్ వంటి జట్లు తమ కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోగా, ఛార్జర్స్ జట్టు పూర్తి బడ్జెట్‌తో కొత్త జట్టును బరిలోకి దింపింది. తొలి సీజన్ విజయంతో ఈసారి టోర్నీని మరింత వైభవంగా నిర్వహిస్తామని, జట్లన్నీ సిద్ధమవ్వడానికి మరో ఆరు వారాల సమయం ఉందని సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ సహ వ్యవస్థాపకులు యశ్వంత్ బియ్యాల మరియు విక్రాంత్ రావు తెలిపారు.







కామెంట్‌లు (0)