బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'మిస్ యూ నాన్నా` : వైఎస్ఆర్ కు వైఎస్.జగన్ నివాళి

2 గంటల క్రితం

'మిస్ యూ నాన్నా` : వైఎస్ఆర్ కు వైఎస్.జగన్ నివాళి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తాడేపల్లి (గుంటూరు) : డాక్టర్‌ వైఎస్సార్ 77వ జయంతిని పురస్కరించుకొని .... వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా..` అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఫోటోలను వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైసిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు కలిసి వైఎస్.రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి వైఎస్సార్ కు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్.జగన్ పులివెందులలో రెండో రోజు పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా పులివెందులలో ఉన్న జగన్ ప్రజాదర్భార్ నిర్వహించారు. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. టెట్ పరీక్ష పైన పలువురు ఉపాధ్యాయులు జగన్ ను కలిసారు. ఈ సమస్య పైన కేంద్రంతో చర్చిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అవినాష్ రెడ్డి సహా పార్టీ నేతలతో స్థానిక అంశాల పైన చర్చించారు. వారికి కీలక దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. కేడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, ఈ రోజు ముఖ్య నేతలతో కలిసి ఇడుపులపాయకు వచ్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్