గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

1 గంట క్రితం

Another setback for YCP MLC Anantha Babu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత బాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిష‌న్‌ను రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు గురువారం కొట్టివేసింది. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది సి.రఘు వాదించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన సాక్షుల విచారణ పూర్తయిందని, మిగిలినవారు కేవలం నిపుణులు, దర్యాప్తు అధికారులు మాత్రమేనని, వారిని బెదిరించే అవకాశం నిందితునికి ఉండదని కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు, బాధితుల న్యాయవాది విశాల్ స్ఫూర్తి విభేదించారు. గతంలో సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా అనంతబాబు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సాక్షులను భయబ్రాంతులకు గురిచేశారని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. నలుగురు కీలక సాక్షులను కాకినాడలోని సమీరా రెసిడెన్సీలో అక్రమంగా నిర్బంధించి, వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని కోర్టుకు తెలిపారు. నిందితుడు స్వయంగా వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా సాక్షులను బెదిరించారని వివరించారు. ఈ వ్యవహారంపైనే సర్పవరం పోలీ‌స్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. దీంతో మే 13న కోర్టు నిందితుడి మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసి రిమాండ్‌కు పంపిందని గుర్తు చేశారు. నిందితునిపై హత్య కేసుతో సహా మొత్తం 19 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2014లో రౌడీషీట్ కూడా నమోదైందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్