గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition3 వరకూ ‘నేతన్నల సేవలో’ దరఖాస్తుల స్వీకరణ : మంత్రి సవిత

2 గంటల క్రితం

ప్రజలు, పోలీసుల సంక్షేమమే లక్ష్యం
- ఎపిఎస్‌‌పి, ఎస్‌‌సిటిపిసి పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో మంత్రి సవితమ్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 09:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేతన్నల సేవలో పథకం రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు సెప్టంబర్ 30వ తేదీతో ముగియగా, దరఖాస్తుల పరిశీలనతో పాటు, అర్హుల గుర్తింపు పూర్తి చేయాల్సి ఉండడంతో, గడువును ఈ నెల 3వ తేదీ వరకూ పెంచినట్లు మంత్రి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి ‘నేతన్నల సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, మొదటి విడతలో 71,536 మందికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. రెండో విడతలో ఆర్థిక సాయం అందించడానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. చేనేత అధికారుల దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టంచేశారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.

డైట్ ఛార్జీల పెంపు

బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని ఆ శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. పెంచిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి రానున్నాయని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన ఛార్జీల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే డైట్ ఛార్జీలను రూ.1,150 నుంచి 1,265కు పెంచినట్లు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,400 నుంచి 1,600కు పెంచగా, ఇంటర్‌తో పాటు ఆపై తరగతుల విద్యార్థులకు రూ.1,600 నుంచి 1,800కు పెంచారని వెల్లడించారు. ఈ పెంపు అక్టోబరు 1 నుంచే వర్తిస్తుందన్నారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నూతన మెనూను కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త మెనూ ప్రకారం వారంలో ఆరు రోజులు విద్యార్థులకు గుడ్లు, మూడు రోజులు చికెన్, ప్రతిరోజూ పాలు, పండ్లు అందించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్