గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2027 ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్ విడుదల

1 గంట క్రితం

2027 ICC ODI World Cup schedule released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

2027లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్ విడుదలైంది.  ఈసారి 2027 వన్డే వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, 12 వేదికలపై 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక టోర్నమెంట్ ఫార్మాట్‌లోనూ ఐసీసీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్ దశ తర్వాత కొత్తగా సూపర్ 7 స్టేజ్‌ను పరిచయం చేశారు. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. వరల్డ్‌ కప్‌లో అక్టోబరు 7న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్లో ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

iCC 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన గ్రూపులను ICC ప్రకటించింది.

గ్రూప్ A:ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ A

గ్రూప్ B: బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, క్వాలిఫయర్ B

టీమ్ ఇండియా షెడ్యూల్

అక్టోబరు 7 - భారత్ X ఆస్ట్రేలియా

అక్టోబరు 10 - భారత్ X పాకిస్థాన్

అక్టోబరు 14 - భారత్ అఫ్గానిస్థాన్

అక్టోబరు 17 - భారత్ క్వాలిఫయర్-ఎ.

అక్టోబరు 24 - భారత్ జింబాబ్వే



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్