ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపిటిసి, జెడ్పిటిసి ఫోటో ఓటర్ల జాబితాలు విడుదల

7 గంటల క్రితం

voter list
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికలకు సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం సెప్టెంబర్‌ 11న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను ప్రచురించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిటిసి నియోజకవర్గాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో, జెడ్ పిటిసి నియోజకవర్గాల ఫోటో ఓటర్ల జాబితాలను జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ 7న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు పూర్తి చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. సంబంధిత కార్యాలయాల్లో ఉంచిన ఓటర్ల జాబితాలను ప్రజలు పరిశీలించువచ్చునని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్