గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంవి రమణ, జి రామన్న

1 గంట క్రితం

dyfi .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 11:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 31 మందితో రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : డివైఎఫ్‌ఐ రాష్ట్ర నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంవి రమణ (నెల్లూరు), కార్యదర్శిగా జి.రామన్న (కర్నూలు) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలోగల డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలోని (గోను చలపతి, చెంచయ్య నగర్ ) కె.పెంచలయ్య ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన డివైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ గురువారం ముగిసింది. 31 మందిని రాష్ట్ర కమిటీకి ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎస్ కె అబ్దుల్లా (కర్నూలు), సహాయ కార్యదర్శిగా కాసాపురం రమేష్ (అనంతపురం), వై.శిరీష (కర్నూలు), ఉపాధ్యక్షులుగా వి.శివకుమార్ (వైఎస్‌ఆర్‌ కడప), కె.బాబు (ప్రకాశం) యుఎస్ఎన్.రాజు (విశాఖపట్నం) ఎన్నికయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్