గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమనమేమైనా బానిసలమా?

1 గంట క్రితం

william-ruto-tata-express-photo.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 12:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • టాటా కెమికల్స్‌ కార్యకలాపాలు ఆపేయండి

  • కెన్యా అధ్యక్షులు సంచలన ఆదేశాలు

నైరోబి : ‘మనమేమైనా ఇతరులకు బానిసలుగా ఉన్నామా? వెంటనే ఆ సంస్థ కార్యాకలాపలు మూసేపారేయండి. కొత్త కంపెనీలు మనమే తెరుద్దాం’ అంటూ టాటా కెమికల్స్‌కు సంబంధించిన వ్యవహారంలో కెన్యా దేశాధ్యక్ష‍ులు విలియం రూటో సంబంధిత అధికారులకు గురువారం సంచలన ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా టాటా మగాది సోడా ఫ్యాక్టరీ పేరుతో కెన్యాలోని మగాది ప్రాంతంలో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే సోడా యాష్‌ తయారు చేస్తోంది. అయితే ఈ సంస్థ పర్యావరణ వ్యర్థాలను సరిగా నిర్వహించడం లేదని, స్థానికంగానూ అభివృద్ధి చర్యలేవీ చేపట్టడం లేదని ఇదివరకే కెన్యా ఆరోపించింది. ఇదే క్రమంలో టాటా మగాది సోడా ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేయాలని, గాజు ఇతర తయారీ ప్రక్రియల్లో ఉపయోగించే సోడా బూడిద ఎగుమతులను కూడా ఆపేయాలని కెన్యా ప్రభుత్వం తమని ఆదేశించిందని టాటా కెమికల్స్‌ ‌ఈ ఏడాది జులై నెలాఖరులో ప్రకటించింది. ఇప్పుడు దేశాధ్యక్ష‍ులే రంగంలోకి దిగారు. కజియాడోలో టాటా కంపెనీ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. తగిన రీతిలో స్థానిక పారిశ్రామిక సామర్ధ్యాన్ని సృష్టించడంలో కంపెనీ విఫలమైందని రూటో విమర్శించారు. టాటా కంపెనీకి వందేళ్ళకు కాంట్రాక్టు వుందని, కానీ వారు ఇక్కడ ఏ ఫ్యాక్టరీని నిర్మించలేకపోయారని అన్నారు. కజియాడోలో వారు పెద్ద గాజు తయారీ కంపెనీని ఏర్పాటు చేయాల్సి వుంది, అలాగే రసాయనాలు తయారుచేయడానికి మరో కంపెనీని కూడా ఏర్పాటు చేయాల్సి వుందని అన్నారు. ‘మనం ఇతరులకు ఏమైనా బానిసలమా?’ అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ప్రతిగా మనమే రెండు సంస్థలను నెలకొల్పుదామని ఆయన తెలిపారు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి టాటా కెమికల్స్‌ ‌వెంటనే అందుబాటులోకి రాలేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్