హైదరాబాద్ : ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో చోటు దక్కింది. CBFCని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 16న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టం నిబంధనల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించింది. నూతన సభ్యుల పదవీకాలం మూడేళ్ల పాటు కొనసాగుతుందని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
బోర్డు ఛైర్మన్‌గా శశి శేఖర్ వేంపటి కొనసాగనుండగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) నుంచి సుప్రియకు ఈ బోర్డులో చోటు దక్కింది. బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, రిక్కీ కేజ్ తదితర సినీ, కళారంగ ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు.
Print Editionకేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నాగార్జున మేనకోడలు సుప్రియ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)