బ్రసీలియా : అక్టోబరు 4న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ పడాలనుకుంటున్న బ్రెజిల్ అధ్యక్షులు లూలా డసిల్వా ఇప్పటికే జరిగిన అనేక ఒపీనియన్ పోల్స్‌లో ఆధిక్యంలో వున్నారు. ఎండిఎ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. వర్కర్స్ పార్టీకి చెందిన లూలాకు తొలి రౌండ్‌లో 40.5 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష లిబరల్ పార్టీ అభ్యర్ధి ఫ్లావియో బొల్సనారోకు 30.4శాతం ఓట్లు లభించాయి. అవంతె పార్టీకి చెందిన అగస్టో కరీ ఆరు శాతం ఓట్లతో మూడో స్థానంలో వున్నారు. ఇతర అభ్యర్ధులకు ఇంకా అంతకన్నా తక్కువ శాతం ఓట్లు లభించాయి. బ్రెజిల్ ఎన్నికల వ్యవస్థ నిబంధనల కింద తొలి రౌండ్‌లో ఏ అభ్యర్ధికీ 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాని పక్షంలో అత్యధిక ఓట్లు వచ్చిన ఇరువురు అభ్యర్ధులు అక్టోబరు 25న జరగనున్న రనాఫ్‌లో పోటీ పడతారు. ఈ పరిస్థితుల్లో లూలాకు, బోల్సనారోకు మధ్య రనాఫ్ జరిగే అవకాశం వుంది. ఓపీనియన్ పోల్‌లో లులాకు 47.3శాతం ఓట్లు రాగా, బోల్సనారోకు 40శాతం ఓట్లు లభించాయి.
Print Editionఓపీనియన్ పోల్స్‌లో లూలా ముందంజ
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)