గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionAFG vs IND 3rd T20I : అభిషేక్ రికార్డు శతకం

58 నిమిషాల క్రితం

adhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:17 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 30 బంతుల్లోనే సెంచరీ

  • చివరి టి20లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం

  • టి20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో, చివరి టి20లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 10 సిక్సులు, 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీతో కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్‌కి తోడు మరో ఓపెనర్‌ సంజు శాంసన్‌(50; 35బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు)కూడా రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోర్‌ చేసింది. భారీ ఛేదనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 14.1ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడో, చివరి టి20లో భారతజట్టు ఏకంగా 127పరుగుల తేడాతో గెలిచి మూడు టి20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఛేదనలో భాగంగా ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ జడ్రాన్‌(25), అజ్మతుల్లా(17), గుర్బాజ్‌(15) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. టీమిండియా బౌలర్లు నితీశ్‌ రెడ్డి, బిష్ణోయ్‌కు మూడేసి, అక్ష‍ర్‌ పటేల్‌కు రెండు, యశ్‌ ఠాకూర్‌, బుమ్రాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అభిషేక్‌ శర్మకు, సిరీస్‌ ఇషాన్‌ కిషన్‌కు దక్కాయి. అభిషేక్‌ శర్మకు అంతర్జాతీయ టి20ల్లో ఇది మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీ కాగా.. 2017లో రోహిత్‌ శర్మ శ్రీలంకపై 35 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును అభిషేక్‌ అధిగమించాడు. టాస్‌ ఓడిన భారత్‌ను ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సునామీ శతకంతో విరుచుకుపడగా.. మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔటయ్యాక భారత్‌ స్కోర్‌ నెమ్మదించింది. తిలక్‌ వర్మ (2), శివమ్‌ దూబే (12), ఇషాన్‌ కిషన్‌ (10), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1), శ్రేయస్‌ అయ్యర్‌ (29) వేగంగా పరుగులు సాధించే ‍క్రమంలో ఔటయ్యారు. అక్షర్‌ పటేల్‌ (5), రవి బిష్ణోయ్‌ (0) అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 2, రషీద్‌ ఖాన్‌, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌటయ్యారు.

అభిషేక్‌-సంజు రికార్డు భాగస్వామ్యం

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి టి20 పవర్‌ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును అభిషేక్‌ శర్మ- సంజు శాంసన్‌ జోడీ బద్దలుకొట్టింది. తొలి ఆరు ఓవర్లలో 100 పరుగులు చేసింది. భారత టి20 క్రికెట్‌లో ఇదే అత్యధికం. 2025లో ఇంగ్లాండ్‌పై చేసిన 95/1 ఇప్పటివరకు మన టాప్‌ పవర్‌ ప్లే స్కోర్‌. ఓవరాల్‌గా ఇది పవర్‌ప్లేలో మూడో అత్యధిక స్కోర్‌. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా జట్టు స్కాట్లాండ్‌పై పవర్‌-ప్లే 6 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 113 పరుగులు చేసి ప్రథమస్థానంలో ఉండగా.. ఆ తర్వాత దక్ష‍ిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌పై 102పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. ఇక అభిషేక్‌ శర్మ క్యాలెండర్‌ ఇయర్‌లో టి20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు(108), ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు(13) రికార్డులను తన పేర లిఖించుకున్నాడు.


స్కోర్‌బోర్డు...

ఇండియా ఇన్నింగ్స్‌: సంజు శాంసన్‌ (సి)రషీద్‌ ఖాన్‌ (బి)అజ్మతుల్లా 50, అభిషేక్‌ శర్మ (సి)గుర్బాజ్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 108, తిలక్‌ వర్మ (రనౌట్‌)రషీద్‌ ఖాన్‌ 2, శ్రేయస్‌ అయ్యర్‌ (రనౌట్‌)ఇబ్రహీం జడ్రాన్‌ 29, దూబే (సి)రషీద్‌ ఖాన్‌ (బి)అజ్మతుల్లా 14, ఇషాన్‌ కిషన్‌ (రనౌట్‌) గుర్బాజ్‌ 10, నితీశ్‌ కుమార్‌ (సి)నూర్‌ అహ్మద్‌ (బి)అబ్దుల్లా 1, అక్ష‍ర్‌ పటేల్‌ (నాటౌట్‌) 5, రవి బిష్ణోయ్‌ (నాటౌట్‌) 0, అదనం 2. (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 221 పరుగులు.
వికెట్ల పతనం: 1/142, 2/152, 3/164, 4/186, 5/205, 6/206, 7/218
బౌలింగ్‌: ఫారూఖీ 4-0-39-0, అజ్మతుల్లా 3-0-27-2, ముజీబ్‌ 4-0-45-0, నబీ 1-0-29-0, రషీద్‌ ఖాన్‌ 4-0-43-1, అబ్దుల్లా 4-0-38-1.


ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (బి)అక్ష‍ర్‌ పటేల్‌ 15, ఇబ్రహీం జడ్రాన్‌ (సి)ఇషాన్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 25, సెద్ధిఖుల్లా (సి)అభిషేక్‌ (బి)అక్ష‍ర్‌ 1, రసూలీ (బి)బుమ్రా 0, అజ్మతుల్లా (సి)బిష్ణోయ్‌ (బి)నితీశ్‌ రెడ్డి 17, నూర్‌-రెహ్మాన్‌ (సి)నితీశ్‌ రెడ్డి (బి)బిష్ణోయ్‌ 11, నబీ (బి)నితీశ్‌ రెడ్డి 8, రషీద్‌ ఖాన్‌ (బి)బిష్ణోయ్‌ 6, ముజీబ్‌ (బి)నితీశ్‌ రెడ్డి 0, అబ్దుల్లా (సి)అక్ష‍ర్‌ (బి)బిష్ణోయ్‌ 6, ఫారూఖీ (నాటౌట్‌) 0, అదనం 5. (14.1ఓవర్లలో ఆలౌట్‌) 94 పరుగులు.
వికెట్ల పతనం: 1/31, 2/33, 3/39, 4/47, 5/70, 6/81, 7/82, 8/82, 9/89, 10/94
బౌలింగ్‌: నితీశ్‌ కుమార్‌ 4-0-25-3, బుమ్రా 2-0-16-1, యశ్‌ ఠాకూర్‌ 2-0-17-1, అక్ష‍ర్‌ పటేల్‌ 3-0-9-2, బిష్ణోయ్‌ 3.1-0-26-3.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్