బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం

1 గంట క్రితం

plant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్‌‌కల్యాణ్‌ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి పివి చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతి మొక్కను గుర్తించారు. శాస్త్రీయ పరిశీలనల్లో, సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్‌తో పోలిస్తే ఈ మొక్క ప్రత్యేకమైన నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్