- అధికారులకు మంత్రి సత్య కుమార్ అభినందనలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : న్యూఢిల్లీలో శుక్ర, శనివారాల్లో జరిగిన ఆయుష్మాన్ భారత్ సమీక్షా సమావేశం 4వ చింతన శివిర్ లో ఎపి కు రెండు అవార్డులను జాతీయ ఆరోగ్య మిషన్ ప్రకటించింది. 70 సంవత్సరాల పైబడిన వృద్ధుల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఆయుష్మాన్ వయో వందన కార్డులను ప్రతి లక్ష మందికి అత్యధిక కార్డులు నమోదు చేసినందుకు పెద్ద రాష్ట్రాల కేటగిరిలో తొలి స్థానం అవార్డును సోంతంచేసుకుంది. పెద్ద రాష్ట్రాల విభాగంలో ప్రతి లక్ష జనాభాకు అత్యధిక ఆరోగ్య రికార్డులను అనుసంధానించినందుకు గాను ఎపికు ఎబిడిఎమ్ (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) అవార్డు లభించింది. ఈ మేరకు అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.







కామెంట్‌లు (0)