మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనాగార్జున కన్ స్ట్రక్షన్స్ ఛైర్మన్ ఎవిఎస్ రాజు కన్నుమూత..

1 గంట క్రితం

1928271-screenshot-2025-06-15-234810.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దేశ నిర్మాణ రంగంలో విశేష సేవలు..

  • పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త

​ప్రజాశక్తి- సఖినేటిపల్లి (డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా), హైదరాబాద్‌ బ్యూరో : నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ అయిన నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్‌సిసి) ప్రయివేటు లిమిటెడ్ వ్యవస్థాపకులు, గ్రూప్ ఛైర్మన్, పద్మశ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు (89) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్ లో ని తన గృహంలో సుమారు రాత్రి ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఎపిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన ఎవిఎస్.రాజు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో హైదరాబాద్ కు వెళ్లి తన స్వయంకృషితో కాంట్రాక్టరుగా వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ లో 1978లో ఎన్ సిసిని స్థాపించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌ఫ్రా కంపెనీగా దీన్ని తీర్చిదిద్దారు. డెక్కన్ సిమెంట్స్ వంటి పలు దిగ్గజ సంస్థల స్థాపనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయన కుటుంబం హైదరాబాద్ లోనే స్థిరపడింది. నిర్మాణ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2010లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. 2007లో సత్యసాయిబాబాపై ఆయన రాసిన పుస్తకం అతి పెద్ద జీవిత చరిత్రగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఎవిఎస్ రాజు మృతి పట్ల పారిశ్రామిక, రాజకీయ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం పది గంటల నుండి భౌతికకాయాన్ని ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్