214 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు బోణీ కొట్టింది. కింగ్స్‌మేడ్ వేదికగా జరి గిన తొలిటెస్టులో ఆస్ట్రేలి యా 214 పరుగుల తేడా తో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 102 పరుగు లతో ఐదో, చివరిరోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 206పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మార్క్‌క్రమ్(75), బెడింగ్హామ్(46), యాన్సెన్(35), ముల్డర్(29) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. రికెల్టన్(2), కెప్టెన్ బవుమా(1), స్టబ్స్(1), వెర్రెయానే(1) నిరాశపరిచారు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 86.5ఓవర్లలో 206 పరుగుల వద్ద ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆసీస్ బ్యాటర్ రెన్‌షాకు లభించింది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో టెస్ట్ 18 నుంచి ప్రారంభం కానుంది.








కామెంట్‌లు (0)