ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసిన యుపిఐ వినియోగంపై చార్జీల పేరుతో బారం మోపడం తగదని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. రూ.2 వేలకు మించిన లావాదేవీలపై 0.4 శాతం రుసుము విధించడంతో మోదీ ప్రభుత్వం యుపిఐ వినియోగంపై అదనపు భారం మోపుతోందని గురువారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. యుపిఐ ‘డిజిటల్ ఇండియా’కు ప్రతీకగా ప్రభుత్వం ప్రచారం చేస్తూనే, దాని వినియోగాన్ని ఖరీదైనదిగా చేయడం సరికాదన్నారు. యుపిఐ ప్రతిపాదిత వ్యాపారి తగ్గింపు రుసుమును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)