ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని వివిధ యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఐసిడిఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇఎస్‌ఐ, పిఎఫ్ అమలు చేయాలన్నారు, హెల్పర్ల ప్రమోషన్లకు సంబంధించిన జిఒ 5ను సవరించి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. నవచేతన యాప్‌తోపాటు ఐవిఆర్ కాల్స్‌ను రద్దు చేయాలని కోరారు. అర్హత కలిగిన అంగన్వాడీలందరూ రెండు రోజుల్లోపు సంక్షేమ పథకాల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేయాలని డైరెక్టర్ తెలిపారు. వేతనాల పెంపును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, హెల్పర్ల ప్రమోషన్ల, మినీ మెయిన్ గా మార్చే అంశాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు) రాష్ట్ర నాయకులు కె సుబ్బారావమ్మ, కెవి కుమారి, రమణమ్మ ఎపి అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి) సరోజ , సారమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్సర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) పద్మ తదితరులు పాల్గొన్నారు.
Print Editionఅంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)