హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్ర గనిలో ఎన్‌ఎండిసి 27.29 క్యారెట్ల నాణ్యమైన వజ్రాన్ని వెలికితీసింది. సెప్టెంబర్ 15న లభించిన ఈ వజ్రం పన్నా కేంద్రంలో సంస్థ ఇప్పటివరకు వెలికితీసిన రెండో అతిపెద్ద వజ్రంగా నిలిచింది. ఈ ఏడాది జులైలోనూ 13.16 క్యారెట్ల వజ్రం లభించినట్లు ఎన్‌ఎండిసి తెలిపింది. మజ్‌గావన్‌లోని పన్నా వజ్ర ప్రాజెక్ట్ 1971–72లో ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నవరత్న కంపెనీ ఎన్‌ఎండిసి ఏటా ఏటా 5 కోట్ల టన్నులకు పైగా ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తోంది.
Print Editionఎన్‌ఎండిసి ఖాతాలో 27.29 క్యారెట్ల వజ్రం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)