గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకలెక్టర్‌ కార్యాలయంలోనూ నామినేషన్లకు అవకాశం

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎన్నికల అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి : కలెక్టర్‌ కార్యాలయం లేదా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ అభ్యర్థులు వినతిపత్రాలు సమర్పిస్తే, వాటిపై మూడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపల్‌, జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో స్థానికంగా నామినేషన్లు దాఖలు చేయలేని అభ్యర్థులకు జిల్లా కలెక్టర్‌ లేదా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఆ అవకాశం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం తీర్పు వెలువరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్