ప్రజాశక్తి-అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ చంద్రపునేఠా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో 28 జిల్లా పరిషత్‌లు, 659 జడ్పీటీసీ, 659 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తం 2,81,34, 518 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.
ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు.








కామెంట్‌లు (0)