మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒక్క పాఠశాల కూడా మూతపడలేదు

1 గంట క్రితం

2077305-naralokeshdsc.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మండలిలో మంత్రి లోకేష్‌

  • కేంద్రం లెక్కలకు భిన్నంగా సమాధానం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత రెండేళ్లలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ ‌పాఠశాలలు ఒక్కటి కూడా మూతపడలేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌శాసనమండలిలో సమాధానమిచ్చారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ఎయిడెడ్‌ ‌పాఠశాలలు మూతపడిన విషయం వాస్తవమేనా? అని వైసిపి సభ్యులు చంద్రశేఖర్‌ ‌రెడ్డి, టి కల్పలత, ఎంవి రామచంద్రారెడ్డి మండలిలో అడిగారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గిన విషయం కూడా వాస్తవమేనా? అని అడిగారు. డిఎస్‌‌సిపై చర్చించాలని వైసిపి సభ్యులు ఆందోళన చేస్తున్న సందర్భంలో మండలి ఛైర్మన్‌ ‌మోషేన్‌రాజు మంగళవారం ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ ‌సమాధానమిస్తూ.. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 7.6 శాతం, 2023-24లో 3.03 శాతం, 2024-25లో 3.24 శాతం వైసిపి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవకతవకలను నివారించి, నకిలీ డేటాను తొలగించామని చెప్పారు. దీంతో 2025-26లో 1.69 శాతం ప్రవేశాలు తగ్గాయని పేర్కొన్నారు. 2026-27 (ప్రస్తుత విద్యా సంవత్సరం)లో 0.94 శాతం ప్రవేశాలు పెరిగాయని తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో గత మూడేళ్లలో 972 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ‌పాఠశాలలు మూతపడ్డాయి. 2024-25, 2025-26 విద్యా సంవత్సం మధ్య 664 పాఠశాలలు మూతపడ్డాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గినా పెరిగాయని చెప్పడం గమనార్హం. 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో 34,92,791 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ విద్యా సంవత్సరం 34,61,612 మంది మాత్రమే ఉన్నారు. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరం 31,179 మంది విద్యార్థులు సర్కార్‌ ‌బడికి దూరమయ్యారు. కానీ ప్రభుత్వం వీటిపై కాకి లెక్కలు చెబుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ ‌పాఠశాలల్లో చదువుతున్న వారి మొత్తం విద్యార్థుల సంఖ్యను శాతంతో పోల్చి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు తగ్గలేదని చెబుతోంది. 2025-26 విద్యాసంవత్సరంలో 84,37,049 మంది విద్యార్థులుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 41.40 శాతం, ఎయిడెడ్‌‌లో 1.13 శాతం, ప్రైవేట్‌‌లో 57.47 శాతం ఉన్నట్లు చూపించింది. 2026-27 సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 81,75,694 మంది ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో 42.34 శాతం, ఎయిడెడ్‌‌లో 1.09 శాతం, ప్రైవేట్‌‌లో 56.57 శాతం చూపించింది. గతేడాదికి, ప్రస్తుత ఏడాదికి ప్రభుత్వ పాఠశాలల్లో 31,179 మంది విద్యార్థులు తగ్గినా.. తగ్గలేదంటూ శాతాల్లో చూపించడం గమనార్హం. అయితే ప్రైవేటు ‌పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి లక్ష మంది విద్యార్థులు చేరారని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్