సిఇఒ వివేక్ యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీ దాదాపు పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 26 నాటికి పురోగతి వివరాలను బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44.28 లక్షల నోటీసులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 43.49 లక్షలు (98.20 శాతం) పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంకా 79 వేల నోటీసులు (1.80) పంపిణీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పంపిణీ చేసిన 43.49 లక్షల నోటీసులకు ఇప్పటి వరకు 14.64 లక్షల విచారణలు (33.67) పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6కు సంబంధించి 1.97 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం-7లో 5,081, ఫారం-8లో 1.38 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బిఎల్‌ఒతో కాల్ బుకింగ్‌కు సంబంధించి 911 కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.







కామెంట్‌లు (0)