శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భారతీ సిమెంట్స్ పిటిషన్‌పై పోలీసులకు నోటీసులు

16 గంటల క్రితం

high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 12:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : భారతీ సిమెంట్స్ మైనింగ్, ప్లాంట్ కార్యకలాపాల అడ్డంకులపై దాఖలైన పిటిషన్‌లో పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ కుంచం మహేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బిసిసిపిఎల్) అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్లాంట్, మైనింగ్ కార్యకలాపాలు అడ్డంకులకు గురవుతున్నాయని, ప్లాంట్‌కు వెళ్లే మార్గాల్లో ఆటంకాలు ఉన్నాయని, గనుల నుంచి లైమ్ స్టోన్ రవాణా, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి ఉందని, రోజుకు సుమారు 400 ట్రక్కులు తిరిగే పరిస్థితి ఉండగా ప్రస్తుతం ఒక్క ట్రక్కు కూడా తిరగడం లేదని, కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం జరుగుతోందని తెలిపారు. ప్లాంట్ కార్యకలాపాలపై ఆధారపడి పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధిపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వచ్చినందున పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని కోర్టుకు తెలియజేస్తామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్