గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీడిపిక్కల ఫ్యాక్టరీలో ప్రమాదం

1 గంట క్రితం

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కార్మికుడికి తీవ్ర గాయాలు

- ఏలూరు తరలింపు

ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జాతీయ రహదారి పక్కన వున్నా జీడిపిక్కల ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు దుర్గయ్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, ఫ్యాక్టరీ సిబ్బంది దుర్గయ్యను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో పని చేస్తుండగా ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. కార్మికుల భద్రతకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై కూడా వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న జంగారెడ్డిగూడెం పోలీసు వారు సిఐ సుభాష్ వారి బృందంతో కలిసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్