ప్రజాశక్తి - యంత్రాంగం : నీట్ పేపర్ లీకు ఘటనకు సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిజెపి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రాష్ర్టంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఎన్ టిఎను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్ ఎస్ఎఫ్ఐ కార్యాలయం వద్ద నాయకులు చేపట్టిన దీక్షను మాజీ ఎంపి మిడియం బాబూరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటన లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యావ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్ టిఎ విఫలమైందని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ టిఎపై నమ్మకం పూర్తిగా దెబ్బ తిన్నందున ఆ సంస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ దీక్షలకు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు హాజరై మద్దతు తెలిపారు. దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం. సుందరబాబు విరమింపజేశారు. శ్రీకాకుళం లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద విద్యార్ధులు చేపట్టిన నిరాహార దీక్షలను విశ్రాంత డిప్యూటీ డిఇఒ కొత్తకోట అప్పారావు దీక్షలను ప్రారంభించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు శిబిరానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. సిఐటియు నాయకులు డి గోవిందరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
Print Editionఎన్‌టిఎను రద్దు చేయాలి.. సిజెపి ఆందోళనకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ రిలే దీక్ష
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 11:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)