మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్‌

18 జులై, 2026

electricity
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్ డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి విద్యుత్‌ రంగంలో 1999-2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు ఇపిఎఫ్ నుంచి జిపిఎఫ్ విధానంలోకి మారేందుకు అనుమతి ఇవ్వాలని ఎపి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి గణపతి విఎస్ఆర్‌కె శనివారం లేఖ రాశారు. ఎపిఎస్ఈబి విభజన అనంతరం ఏర్పాటైన ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగాలు రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లభించాల్సిన పెన్షన్ రక్షణకు దూరమయ్యారని పేర్కొన్నారు. ఈ వివక్ష కారణంగా విద్యుత్ రంగంలో ఒకే సంస్థలో, ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళన, అభద్రతా భావం, అసంతృప్తికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన జిఓఎంఎస్‌ నెం.53కు అనుగుణంగా విద్యుత్‌ ఉద్యోగులను కూడా పాత పెన్షన్ పథకం (జిపిఎఫ్) విధానంలోకి మార్చలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్