శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒంగోలు వైసీపీ ఎస్టీ సెల్ మహిళా నేత ఆత్మహత్యాయత్నం

1 గంట క్రితం

suside
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెల్ఫీ వీడియోలో ఆవేదన

ప్రజాశక్తి-ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఎస్టీ సెల్ మహిళా నాయకురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పార్టీ నేతలు తనను దూరం పెడుతున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దారుణానికి ఒడిగట్టే ముందు ప్రసన్న ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియోలో వైసిపిలోని కొందరు నాయకుల వేధింపులు, తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆమె పెద్ద సంఖ్యలో నిద్రమాత్రలు మింగినట్లు సమాచారం. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రసన్న రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకుని, ఆమె ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు మరియు నిందితులపై విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్