విశాఖపట్నం : విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో న్యాయపోరాటం చేస్తున్నారు. రాధాగాయత్రిని భర్త శ్రీచరణ్ హత్య చేశాడని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు చేయాలని ఇప్పటికే దేహ్రాదూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మసూరీ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ కేసు విచారణ ప్రారంభించారు. జూన్ 14, 16 మధ్య మసూరీలో ఏం జరిగిందో అధికారుల దర్యాప్తులో తేలనుంది. తల్లిదండ్రులు రాకుండానే శవపరీక్ష చేసిన సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి గత నెలలో రాధాగాయత్రి, శ్రీచరణ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడి హోమ్ స్టేలో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి విదితమే.
టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 01:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)