శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

1 గంట క్రితం

Bullet trains connecting Hyderabad, Chennai, and Bengaluru: Minister Ashwini Vaishnaw
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ను కేంద్రం భారీగా పెంచిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో వికసిత్‌ భారత్‌-2047.. సాంకేతికత పాత్ర’ అనే అంశం నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ ... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు రానున్నాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే బడ్జెట్‌ రూ.880 కోట్లు మాత్రమే.. మోడి సర్కార్‌ కేవలం తెలంగాణకే రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యిందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు ఇచ్చామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్