షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ .... శనివారం స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ ... నిరసనకారులు నినదించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి షాబాద్ పీఎస్ వద్దకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షాబాద్లో బాధితులను కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐ, ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత - బాధితులకు కలెక్టర్ హామీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 01:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)