మంగళగిరి (గుంటూరు) : విజయనగరం, మన్యం జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళుతున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులకి చెరుకు గెడలను ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ రెండు కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. జయంత్, అభిమన్యులకు గతంలో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉంది. అందుకే ముందుగా వాటిని అక్కడికి పంపిస్తున్నారు. ఒడిశా నుంచి అడవి ఏనుగులు వచ్చి పంట పొలాల్ని ధ్వంసం చేస్తున్నాయని, అక్కడి ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఒడిశా నుంచి కూడా కొన్ని కుంకీ ఏనుగులను రప్పించి అడవి ఏనుగులను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈలోగా మనవద్ద ఉన్న కుంకీలతో వీలైనంతమేర అడవి ఏనుగులను అడవిలోకి పంపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అడవి ఏనుగుల కట్టడి ఆపరేషన్ - కుంకీ ఏనుగులకు పవన్ స్వాగతం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)