తెలంగాణ : న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ పై దాడి, విద్యార్థులపై లాఠీ ఛార్జీ, అరెస్టులను ఖండిస్తూ .... శుక్రవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ కూడలి నుంచి హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ చేపట్టారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందని ఆగ్రహాన్ని వ్యక్త ంచేశారు. ప్రశ్న పత్రాలను కాపాడలేని నాయకులు.. దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత - పోలీసులు నేతల మధ్య తోపులాట
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)