ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడలో సెప్టెంబర్ పది నుండి 12వ వరకు ఐద్వా కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నగరంలోని 60 డివిజన్ వాంబే కాలనీ జి బ్లాక్ లో గురువారం విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకూ మహిళలపై హింస పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయడం లేదని విమర్శించారు. దీంతో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వీటి పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించేందుకు ఐద్వా సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీదేవి, వి.సావిత్రి, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు కాజ సరోజ, సహాయ కార్యదర్శి సుజాత, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రత్నకుమారి, రషీద తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)