ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలి: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ: ఒంగోలులో నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ 2025 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపాల్ జి.ఆర్. రాధిక, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న మహిళా పోలీసు కానిస్టేబుళ్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, శిక్షణ సమయంలో ఇచ్చే స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి తెలిపారు. సామాన్య ప్రజల రక్షణ, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)