గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలి : జిన్‌పింగ్‌

50 నిమిషాల క్రితం

Jinping
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : చైనా, అమెరికాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతం పలికిన అనంతరం జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. ‘‘మన రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలి’’ అని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రచురించిన లిఖితపూర్వక ప్రకటనలో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనా, అమెరికా ప్రజల మధ్య దీర్ఘకాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ పరిస్థితులకు సంబంధించిన ప్రధాన అంశాలపై ట్రంప్‌తో సుదీర్ఘంగా చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు జిన్‌పింగ్‌ పేర్కొన్నారని జిన్హువా నివేదించింది. సహకారమే ప్రధాన ఆధారంగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగాలని, పరస్పర పోటీ పరిమితులకు లోబడి ఉండాలని, విభేదాలను అదుపులో ఉంచుకుంటూ శాంతియుతంగా ముందుకు సాగాలని జిన్‌పింగ్‌ అన్నారు. రెండు అగ్రరాజ్యాలు కలిసి ముందుకు సాగేందుకు సరైన మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. ఇరు పక్షాల ఉమ్మడి కృషితో తన పర్యటన సత్ఫలితాలను ఇస్తుందని, ప్రజల శ్రేయస్సును పెంపొందించడంతోపాటు ప్రపంచ శాంతికి కొత్త ఆశను కలిగిస్తుందని విశ్వసిస్తున్నట్లు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్