సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌‌లో పిఎం కుసుమ్‌ ప్రాజెక్టులు ప్రారంభం

1 గంట క్రితం

vijay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 10:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 228 ఫీడర్ స్థాయి ద్వారా సోలార్‌ విద్యుత్‌

- ఇంధన శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిఎం కుసుమ్‌ ‌ప్రాజెక్టులు అక్టోబర్‌లో ప్రారంభించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ అన్నారు. పిఎం కుసుమ్‌పై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 228 ఫీడర్‌ ‌స్థాయి సౌరప్లాంట్లకు భూసేకరణ పూర్తయిందని, సివిల్‌ ‌పనులు, పరికరాల సేకరణ, ఫైనాన్షియల్‌ ‌క్లోజర్‌ , చట్టబద్ధమైన పత్రాల ప్రక్రియాలను పర్యవేక్షించాలని చెప్పారు. ఎస్పిడిసిఎల్‌లో 191.5 మెగావాట్ల ఉమ్మడి సామర్ధ్యంతో 49 ఎఫ్‌ఎల్‌ఎస్‌ ‌ప్లాంట్లు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఇపిడిసిఎల్‌ ,ఎస్పిడిసిఎల్‌ ‌పరిధిలో 19.9 మెగావాట్లు, 11.99 మెగావాట్లు చొప్పున సెప్టెంబర్‌‌లో, ఇపిడిసిఎల్‌ ‌పరిధిలో అక్టోబర్‌‌లో 13.5 మెగావాట్లు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఈ రెండు నెలల్లో 109.7మెగావాట్లు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సమీక్షలో డిస్కంల సిఎండిలు శివశంకర్‌, పృథ్వీతేజ్‌, పి పుల్లారెడ్డి, నెడ్‌‌క్యాప్‌ ఎండి కమలాకర్‌ ‌బాబు తదితరులు పాల్గొన్నారు.

జెఎన్‌‌టియు అనంతపురంలో మోడల్‌ ఎలక్ర్టిక్‌ ‌వంట: జెన్‌‌కో ఎండి నాగలక్ష్మీ

అనంతపురంలోని జెఎన్‌‌టియు అనంతపురంలో రాష్ట్రంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ఎలక్ర్టిక్‌ ‌కుకింగ్‌ ‌డెమన్‌‌స్ర్టేషన్‌ ‌ప్రాజెక్టు చేపడతున్నట్లు జెన్‌‌కో ఎండి ఎస్‌ ‌నాగలక్ష్మీ వెల్లడించారు. జెఎన్‌‌యుటి, జెన్‌‌కో మధ్య అవగాహన ఒప్పందం విజయవాడలోని జెన్‌‌కో కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నాగలక్ష్మీ మాట్లాడుతూ జెఎన్‌‌టియు ప్రాంగణంలోని హంపీ హాస్టల్‌‌లో ఈ కుకింగ్‌ ‌ప్రాజెక్టు అమలుకు బిఇఇ మార్గదర్శకాల మేరకు ఆమోదం పొందిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వాణిజ్య స్థాయి ఎలక్ట్రిక్‌ ‌వంట పరికరాల కొనుగోలు, ఏర్పాటు, పరీక్షలు పనుల కోసం ఈ ఆర్ధిక సంవత్సరం ఎపిఎస్‌ఇసిఎం రూ.81.80లక్షల సాయం మంజూరు చేసిందన్నారు. పరిశుభ్ర ఇంధన దిశగా ఎపి కీలక అడుగు వేస్తుందని అన్నారు. పర్యావరణహిత, సురక్షిత, తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ర్టిక్‌ ‌వంటి సాంకేతికతను ప్రోత్సహించడంలో ఎపి ముందంజలో ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్