గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులపై పోలీస్ దాడులు దుర్మార్గం

12 సెప్టెంబర్, 2026

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 11:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్ఎఫ్ఐ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పారామెడికల్‌ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దుర్మార్గం అని ఎస్ఎఫ్ఐ రాష్ట్రకమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం కార్యదర్శి కె ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులు భగత్ రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుక్తంగా పోరాడుతున్న విద్యార్థులు, విద్యార్ధినులపై పోలీస్ లు అమానుషంగా వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. నెలకు రూ.15,000 స్టైఫండ్‌ ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్‌ కాలాన్ని గరిష్ఠంగా ఆరు నెలలకు పరిమితం చేయాలని కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గంమని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, పోలీసు నిర్బంధం, అరెస్టులతో అణచివేత చర్యలకు పాల్పడటం తీవ్ర అన్యాయమని తెలిపారు. విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అలిపిరి వరకు శాంతి యుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్బంగా అలిపిరి పోలీస్ లు అడ్డుకొని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు సునీత జుట్టు పట్టుకొని లాకెళ్లడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పారామెడికల్‌ విద్యార్థులతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉదృతంంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్