ప్రజాశక్తి–తిరుపతి: మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసులు ఆదివారం నోటీసులు అందజేశారు. తిరుపతిలోని న్యూ మారుతి నగర్లో ఉన్న ఆయన నివాసానికి పుంగనూరు పోలీసులు చేరుకున్నారు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం పుంగనూరుకు రావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. పుంగనూరు పరిసర ప్రాంతాలకు కూడా రావద్దని సూచించారు. పోలీసుల నోటీసులపై పెద్దిరెడ్డి స్పందించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు దారుణమని ఆయన మీడియా ముందు వెల్లడించారు.
మాజీ మంత్రి పెద్ద రెడ్డికి పోలీస్ నోటీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)