ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి : అబ్జర్వర్ కన్నబాబు

1 గంట క్రితం

kannababu.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మర్యాద పూర్వకంగా ఆహ్వానించిన కలెక్టర్ కృతికా శుక్లా

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జనరల్ అబ్జర్వర్ కన్నబాబు అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించి, ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాకు వచ్చిన జనరల్ అబ్జర్వర్ కన్నబాబుకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష, జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన జనరల్ అబ్జర్వర్ ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్