ప్రజాశక్తి-పార్వతీపురం : జ్ఞానేశ్వర్ కుమార్ ను ఎన్నికల కమిషన్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం(అక్టోబర్ 10న) జరగనున్న ఆందోళనలో పాల్గొనకుండా రాష్ట్రంలో పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుండి పార్వతీపురం మన్యం జిల్లాలో సిపిఎం జిల్లా కార్యదర్శితో సహా పలువురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ విజయవాడలో అక్టోబర్ 10న జ్ఞానేశ్వర్ కుమార్ ను ఎన్నికల కమిషన్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ జరిగే ధర్నాకు వెళ్ళకుండా వేకువ జామున ఇళ్లకు వచ్చి సిపిఎం నాయకులు ను హౌస్ అరెస్ట్ లు చేశారని అన్నారు. మక్కువలో జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, పార్వతీపురంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, పాచిపెంటలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావును హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించారు. సాలూరులో ఎన్ వై నాయుడు , మర్రి శ్రీనివాసరావులకు నోటీసులు జారీ చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా నాయకులను నిర్బంధిస్తున్నారని , నిర్బంధాన్ని ప్రజలాంతా ఖండించాలని పిలుపునిచ్చారు. సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ దేశంలో 13 కోట్ల ఓట్లును తీసివేసి దేశంలో బిజెపి గెలుపుకు సహకరించారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు. ప్రజల ఓట్లు అకారణంగా తొలగించే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు.
సీపీఎం నేతలను నిర్బంధించిన పోలీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)