సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

659 జెడ్‌‌పిటిసి స్థానాల్లో పోలింగ్‌

1 గంట క్రితం

659 జెడ్‌‌పిటిసి స్థానాల్లో పోలింగ్‌
-9,829  ఎంపిటిసిలకు కూడా
-నోటిఫికేషన్‌ విడుదల 
_ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.81 కోట్ల మంది ఓటర్లు 
 35,333 పోలింగ్ కేంద్రాలు
-మైదుకూరు మున్సిపల్‌ ఎన్నిక వాయిదా 
 -రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 9,829 ఎంపిటిసిలకు కూడా

- నోటిఫికేషన్‌ విడుదల

_ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.81 కోట్ల మంది ఓటర్లు

- 35,333 పోలింగ్ కేంద్రాలు

- మైదుకూరు మున్సిపల్‌ ఎన్నిక వాయిదా

- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 659 జెడ్‌‌పిటిసి, 659 మండల ప్రజా పరిషత్‌ల పరిధిలో 9,829 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2,81,34,518 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ​ రాష్ట్రంలో మొత్తం 663 జెడ్‌‌పిటిసి స్థానాలు ఉన్నాయని, వాటిలో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు. అలాగే 29 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 659 మండల కేంద్రాలు, 28 జిల్లా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.​ ఎన్నికల నిర్వహణకు జిల్లా ప్రజా పరిషత్‌లకు 28 మంది రిటర్నింగ్ అధికారులు, మండల ప్రజా పరిషత్‌లకు 687 మంది రిటర్నింగ్ అధికారులు, 1,374 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. పోలింగ్ విధుల కోసం 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది ఇతర పోలింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ వివరించారు. రాష్ట్రంలో మొత్తం 663 రెవెన్యూ మండలాలు ఉండగా, అమరావతి ప్రాంతంలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. మచిలీపట్నం, ఆదోని మండలాల విభజనతోపాటు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావడంతో ఎన్నికలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ మల్లికార్జున, ఐజి బి రాజకుమారి పాల్గొన్నారు.

అంకెల్లో జెడ్‌‌పి ఎన్నికలు

మొత్తం ఓటర్లు : 2,81,34,518

పురుషులు : 1,38,53,807

మహిళలు : 1,42,79,285

మొత్తం పోలింగ్‌ ‌కేంద్రాలు : 35,333

సున్నితమైనవి : 9,186

అత్యంత సున్నితమైనవి : 16,181

మైదుకూరు మున్సిపల్‌ ఎన్నిక వాయిదా

కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో కొన్ని వార్డులకు సంబంధించిన నామినేషన్ పత్రాలు చినిగిపోయినట్లు కలెక్టర్ నివేదిక సమర్పించారని చెప్పారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించి మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను నిలిపివేసినట్లు వెల్లడించారు. కడపతోపాటు ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలపైనా నివేదికలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

​

ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి ఎన్నికలు ఇలా..

కార్యక్రమం తేది

----------------------------------------------------------------------------------

నామినేషన్లు ‌ప్రారంభం 21.10.2026

నామినేషన్‌ ‌స్వీకరణకు ఆఖరి రోజు 23.10.2026

నామినేషన్ల పరిశీలన 24.10.2026

తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీలు 25.10.2026

అప్పిలేట్‌ అధికారిచే అప్పీళ్ల పరిష్కారం 26.10.2026

నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు 27.10.2026

పోలింగ్‌ ‌తేదీ 03.11.2026

రీ పోల్‌ ఏదైనా ఉంటే 04.11.2026

ఓట్ల లెక్కింపు 05.11.2026

-------------------------------------------------

జిల్లాల వారీగా జెడ్‌ ‌పిటిసి, ఎంపిటిసి వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో అతి చిన్న జిల్లా పరిషత్‌ ‌ఛైర్మన్‌ ‌గా విశాఖపట్నం నాలుగు జెడ్‌‌పిటిలతో ఏర్పాటు చేయడం గమనార్హం.

------------------------------------

జిల్లాలు జెడ్‌‌పిటిసిలు ఎంపిటిసిలు

-----------------------------------

1. అనకాపల్లి 24 427

2. అనంతపురం 31 450

3. అన్నమయ్య 25 321

4. అల్లూరి సీతారామరాజు 11 172

5. బాపట్ల 20 300

6. చిత్తూరు 27 370

7. కోనసీమ 19 379

8. తూర్పుగోదావరి 21 412

9. ఏలూరు 27 454

10. గుంటూరు 13 200

11. కాకినాడ 20 401

12. కృష్ణా 26 352

13. కర్నూలు 26 432

14. మార్కాపురం 21 274

15. నంద్యాల 28 377

16. ఎన్టీఆర్ 16 280

17. పల్నాడు 28 419

18. పోలవరం 12 101

19. పార్వతీపురం మన్యం 15 226

20. ప్రకాశం 27 373

21. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 35 440

22. శ్రీ సత్యసాయి 32 397

23. శ్రీకాకుళం 30 542

24. తిరుపతి 35 444

25. విశాఖపట్నం 4 53

26. విజయనగరం 27 449

27. పశ్చిమ గోదావరి 20 371

28. వైఎస్ఆర్ కడప 39 413

--------------------------------

659 9829

--------------------------------

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్