శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హమాలీల కూలీరేట్ల పై సానుకూల చర్చలు

1 గంట క్రితం

hamali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 08:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- యూనియన్ల వెల్లడి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హమాలీల కూలిరేట్ల పెంపుపై రాష్ట్రప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చిందని హమాలీల యూనియన్లు వెల్లడించాయి. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండి ఎస్ ఢిల్లీరావు యూనియన్‌ ‌నాయకులతో శుక్రవారం తన కార్యాలయంలో చర్చలు జరిపారు. హమాలీల కూలిరేట్ల పెంపు, గోనెసంచులు, పామాయిల్, స్వీపర్ జీతం, దహన సంస్కారాలకు ఆర్ధిక సహాయాల విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. శాఖ పరిధిలో ఉన్న దసరా బోనస్, స్వీట్, మంచినీటికి సంబంధించిన రేట్ల ను త్వరలోనే పెంచి ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎపి పౌరసరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ (సిఐటియు) రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్వింటాళ్ళకు రూ.28ల నుంచి రూ.45లకు పెంచాలని, గోనె సంచులకు రూ.55 నుంచి 90లకు, పామాయిల్‌కు రూ.3లకు, స్వీపర్‌లకు వేతనాలు రూ.5 నుంచి రూ.15వేలకు పెంచాలని కోరారు. దహన సంస్కారాలకు రూ.20 వేల నుంచి రూ.40 వేలు , దసరా బోనస్ రూ.6500 నుంచి రూ.15 వేలు పెంచాలని కోరారు. పాతికేళ్లుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇఎస్ఐ కేసును ప్రభుత్వం ఉపసంహరించి పథకాన్ని అందరికీ అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. వేతనాల బిల్లులు ప్రతి నెలా 5 వ తేదీలోగా చెల్లించాలని, హమాలీ బిల్లుల చెల్లింపులకు డీలర్ల వేలిముద్రను ఉపసంహరించాలని కోరారు. ఎఐటియుసి నాయకులు ఎస్.వెంకట సుబ్బయ్య ఆ సంఘం తరపున పలు ప్రతిపాదనలను వివరించారు.ఈ చర్చల్లో కార్పొరేషన్‌ ‌పిడిఎస్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ ఎల్‌ ‌నరసింహారావు, ఎంఎం.ఆనందరావు, హమాలీల రాష్ట్ర యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ కృష్ణ, ఎస్.ఉధయభాస్కరరావు, కోశాధికారి బి.ఆంజనేయులు, ఉపాధ్యక్షులు బి.నాగరాజు, కృష్ణ, శంకర్, రాజు, మోజెస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్