బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాలి

1 గంట క్రితం

619e8359-2f59-453a-a4ec-4a9c29de3104.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

  • చీరాల క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష

ప్రజాశక్తి-చీరాల: మురుసు తుఫాను ప్రభావంతో చీరాల నియోజకవర్గంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులతో కలసి ఆయా నియోజకవర్గం పరిస్థితిలపై ఆరా తీశారు .ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తుఫాను ప్రభావంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ ఈఎన్‌సీ, ఎస్‌ఈలతో మాట్లాడి విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తుఫాను బాధితులకు అండగా నిలవాలని టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, తాగునీరు, వసతి వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమీక్షలో చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేందర్ నాథ్ యువనేత అమర్నాథ్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్