విజయవాడ: ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ – 2026 ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులకు 20 మంది ఫోటోగ్రాఫర్లు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ కుంచం రాజేష్ స్థానం సంపాదించారు. అవార్డు జాబితాలో
ఈ అవార్డుల కార్యక్రమంలో మొత్తం 20 అవార్డులు ప్రకటించగా, ఎంపికైన విజేతలకు రూ.5,000 నగదు బహుమతి, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందజేయనున్నట్లు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కుంచం రాజేష్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కడం పట్ల ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.
‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఎంపిక అయిన రాజేష్ తీసిన ఫోటో ఇదే..








కామెంట్‌లు (0)