ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం విజయవాడ ఆర్‌టిసి ప్రధాన కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె ఎస్ బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాటంలో ప్రకాశం పంతులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమన్నారు. బ్రిటిష్ వారిని ఎదిరించే విషయంలో ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కొనియాడారు. ప్రథమ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. సంస్థ ప్రగతితో పాటు ఉద్యోగుల కుటుంబాల అభివృద్ధికి దోహదపడేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్, బోర్డు సెక్రటరీ వి శ్రీధర్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (పిఎన్‌బిఎస్) పవన్, వి అండ్ ఎస్‌ఎ మధు, పర్సనల్ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌డిడి) ఎ.మాణిక్యం, ఇతర అధికారులు, సూపర్‌వైజర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రకాశం పంతులు ధైర్యసాహసాలు ఆదర్శనీయం
23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)