ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి ముర్ము చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేశ్ పాశ్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు.
దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 08:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)