నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మంచి విజయం సాధించడంతో దాని సీక్వెల్ ‘కల్కి 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభమైనట్లు సమాచారం. తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటుండగా, ఆయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ తన కుమార్తెలు ప్రియాంకాదత్, స్వప్నాదత్లతో కలిసి నిర్మిస్తున్నారు. 2027 నాటికి చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
ప్రభాస్పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)