సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంత పెద్ద స్టార్ అయినా చాలా నిరాడంబరంగా ఉంటారని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి గుర్తుచేశారు. రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నెల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పటివరకు పనిచేసిన నటుల్లో షూటింగ్‌కు అతి తక్కువ మంది సిబ్బందితో వచ్చే వ్యక్తి రజనీకాంత్ మాత్రమే. సాధారణంగా స్టార్ వస్తున్నాడంటే హడావుడి ఉంటుంది. కానీ ఆయన వచ్చిన విషయం ఎవరికీ తెలిసేది కాదు. మేము వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన అప్పటికే సెట్లో ఉండి, నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ కనిపించేవారు’ అని ప్రశంసించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆయన వచ్చిన విషయం ఎవరికీ తెలిసేది కాదు!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 08:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)