‘శంబాల’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కరికాల’. ఇప్పటికే కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా మరో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేసింది. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం 2027 జూలై 2న, రెండో భాగం అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 07:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)