- నేడు జిల్లాల్లో కలెక్టర్లకు వినతులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టెట్ (టీచర్ ఎలిజబులిటి టెస్ట్) అమలకు ముందే చట్టబద్ధంగా నియామకమైన ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించేలా పార్లమెంట్‌లో చట్ట సవరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలి రెడ్డి,షేక్ జంషీద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అమలకు ముందు అప్పటి అమల్లో ఉన్న నియామక నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరి ఎన్నో సంవత్సరాలుగా విద్యాసేవలు అందిస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తగిన చట్ట సవరణ చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పార్లమెంటులో చట్ట సవరణ చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సంఘ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)